in

SALEEM GARITHO VIDHI AADINA VINTHA NATAKAM!

ముగ్గురు ముఖ్య మంత్రుల ను తెర మీద ఒక ఆట ఆడించిన డాన్స్ మాస్టర్ సలీం తో విధి ఆడిన వింత నాటకం. యెన్.టి. ఆర్., ఏం.జి.ఆర్, జయలలిత గార్లను, సినిమాలలో డాన్స్ డైరెక్టర్ గ చిందులు వేయించిన సలీం మాస్టర్ జీవితం, క్షణికావేశం లో చిందర వందర అయి చివరకు దిక్కులేని వాడిలా ఒక మురికివాడలో మరణించారు. రెండు దశాబ్డల పాటు తిరుగులేని డాన్స్ మాస్టర్ గ ఒక వెలుగు వెలిగిన సలీం మాస్టర్ ఆర్ధికంగా బాగానే స్థిరపడ్డారు, ఆయన సొంత షాప్ లో అద్దెకు ఉంటున్న హార్డ్వేర్ వ్యాపారి తో గొడవపడి, ఆవేశం లో చేతికి అందిన ఇనుప వస్తువు ను అతని మీదకు విసిరారు సలీం మాస్టర్, అది కాస్త తగలరాని చోట తగిలి అతను అక్కడికి అక్కడే మరణించాడు. దాని కారణం గ సలీం మాస్టర్ కు జైలు శిక్ష పడింది, శిక్ష పూర్తి చేసుకొని బయటకు వచ్చే సరికి అయిన వాళ్ళు కాస్త ఉన్నది కాజేశారు, ఇటు సినీ పరిశ్రమ కూడా నేరస్తుడిగా ముద్ర పడిన సలీం మాస్టర్ ని పట్టించుకోలేదు.ఒకప్పుడు తమ సినిమా కు సలీం గారే డాన్స్ మాస్టర్ గ ఉండాలి అనే పట్టుపట్టిన వారు ఎవరు ఆయనను పట్టించుకోలేదు, తీవ్రమయిన మానసిక క్షోభ కు గురి అయిన ఆయన తన ఆస్తుల పత్రాలు ఒక పాత సూటుకేసు లో పెట్టుకొని పిచ్చివాడిలా తిరుగుతు కటిక దరిద్రం అనుభవించి చివరకు అక్టోబర్ 16 , 2011 లో మరణించారు. దాదాపుగా ౩౦౦ చిత్రాలు, 20 000 పాటలకు కొరియోగ్రఫీ చేసిన సలీం మాస్టర్ చరిత్ర ఆ విధంగా విశాదంతం అయింది.

google shocks director rajamouli!

happy birthday GAUTHAM VASUDEVA MENON!