
మద్రాసు, టీ.నగర్, విజయరాఘవాచారి రోడ్ , హౌస్ నెంబర్ 11 లో ముగ్గురు ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ అద్దెకు దిగారు, ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? ఉందండీ, ఆ రూమ్ లోనే సినిమా అవకాశాల కోసం వచ్చిన కొత్తలో నందమూరి తారక రామ రావు గారు ఉండే వారు, ఆ తరువాత అదే రూమ్ లో ఎస్. వి. రంగా రావు గారు ఉండే వారు. ఇంతకీ ఆ గది లో అద్దెకు దిగిన ముగ్గురు యువకులు ఎవరో తెలుసా ? ఇప్పటి మెగాస్టార్ చిరంజీవి గారు, సుధాకర్ గారు, హరి ప్రసాద్ గారు. ఈ ముగ్గురి లో మొదటిగా సుధాకర్ గారికి పునాదిరాళ్ళు సినిమా లో అవకాశం వచ్చింది, తమలో ఒకరి అవకాశం వచ్చినందుకు సంతోషించారు. పాండి బజార్, గీతా కేఫ్ దగ్గర నుంచున్న సుధాకర్ ను చూసిన భారతి రాజా గారు, తన అసిస్టెంట్ తో సుధాకర్ ను పిలిపించుకొని కీళుక్కుమ్ పోగుమ్ రైలు చిత్రంలో హీరో గ అవకాశం ఇచ్చారు, ఆ చిత్రమే తెలుగులో తూర్పు వెళ్లే రైలు అని బాపు గారు రీమేక్ చేసారు. మరుసటి రోజు సుధాకర్, చిరంజీవి గారిద్దరు పునాదిరాళ్ళు డైరెక్టర్ గూడపాటి రాజ్ కుమార్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు. అయన వెంటనే సుధాకర్ కి కంగ్రాట్స్ చెప్పి, మీరు కూడా ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కదా ఆ క్యారెక్టర్ మీరు చేయండి అని చిరంజీవి గారి ని అడిగారట. ఆ విధంగా చిరంజీవి గారికి మొదటి అవకాశం దక్కింది, కానీ ప్రాణం ఖరీదు సినిమా ముందు రిలీజ్ అయింది.అదే భారతి రాజా గారు హరి ప్రసాద్ గారిని కూడా హీరో గ ఇంట్రడ్యూస్ చేసారు. ఇదంతా ఆ రూమ్ ప్రభావమే అంటారా?ఏమో మరి ఇది మాత్రం మనకు తెలిసిన వాస్తవం.
 
					 
					
