in

Nothing exciting is coming Janhvi Kapoor’s way from tollywood!

తిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి తెలుగులో హీరోయిన్ గా చేస్తే చూడాలని చాలా మంది ఆశపడుతున్నారు. దానికోసం మేకర్స్ కూడా చాలా రోజుల నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా కొరటాల కూడా ఎన్టీఆర్ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్ అయితే బావుంటుందని జాన్వీని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. కొరటాల శివ, ఎన్టీఆర్ సినిమాలో ఆలియా హీరోయిన్ గా చేసేది డౌట్ అవ్వడంతో జాన్వి ని కూడా ఓ ఆప్షన్ గా పెట్టుకున్నారు. మరో వైపు బోనీకపూర్ కూడా జాన్వికి సౌత్ సినిమాల మీద ఇంట్రస్ట్ ఉందని, తప్పకుండా చేస్తుందని చాలా ఇంటర్వ్యూ ల్లో చెప్పారు.

ఇక జాన్వి కూడా తెలుగులో చెయ్యడానికి ఓకే అని, విజయ్ దేవరకొండ తో నటించాలని ఉందని గతంలో చెప్పింది. జాన్వి కూడా సౌత్ లో సినిమాలు తప్పకుండా చేస్తానని ఓపెన్ గానే చెబుతోంది..కానీ ఇప్పటి వరకూ సౌత్ డైరెక్టర్లు ఆఫర్ చేసిన ఏ ఒక్క సినిమాకీ ఓకే చెప్పలేదు జాన్వి. కొరటాలతో పాటు అంతకుముందు పూరీ జగన్ కూడా జాన్విని ఎలా అయినా తెలుగులో లాంచ్ చెయ్యాలని తెగ ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ వర్కవుట్ అవ్వలేదు.

ఓ వైపు సౌత్ లో సినిమాల మీద ఇంట్రస్ట్ ఉందని చెబుతున్న జాన్వి, స్టార్ హీరోల పక్కన చెయ్యమని స్టార్ డైరెక్టర్లు ఆఫరిస్తున్నా ఒక్క సినిమాకి కూడా ఓకే అనలేదు. పోనీ బాలీవుడ్ లో వందలకోట్ల మార్కెట్ ఉన్న పెద్ద హీరోయిన్ కూడా కాదు జాన్వి. మరి జాన్వి కపూర్ తెలుగు సినిమాకి ఇంత వరకూ ఓకే చెప్పకపోవడానికి రీజన్ ఏమై ఉంటుందా అని తెగ ఆలోచిస్తున్నారు అంతా. టాలీవుడ్ వర్గాలు మాత్రం జాన్విని టాలీవుడ్ తీసుకొచ్చే ప్రయత్నాలు మాత్రం ఆపట్లేదు. మరి జాన్విని టాలీవుడ్ కి ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారో చూడాలి..

vote for your most watched movie in recent times!

Shruti Haasan Opens Up On Her Idea Of Marriage!