ట్యాలెంట్ బాగా ఉన్నప్పటికీ నివేదా థామస్ కు సరైన అవకాశాలు లభించకపోవడంతో ఇప్పటికీ ఆమె బి గ్రేడ్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. ఈవారం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతున్న ‘వి’ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ నివేదా ఈసినిమాకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు తెలియచేసింది. ఈ మూవీలో తాను హీరో నానీతో కలిసి నటించిన అనుభవాలు గురించి వివరిస్తూ తాను ‘జెంటిల్ మెన్’ మూవీలో నానీతో కలిసి నటించినప్పటి నుంచి తమ మధ్య అనుబంధం పెరుగుతూ వచ్చిందని నాని తనకు ఒక హీరోలా కాకుండా ఒక కుటుంబ సభ్యుడులా కనిపిస్తాడు అంటూ కామెంట్ చేసింది.
అంతేకాదు తాను నటించబోయే సినిమా కథకు సంబంధించి ఏవిషయం ఉన్నా నాని సలహాలు అడుగుతూ ఉంటానని తన కెరియర్ విషయంలో నాని ఎప్పుడు అనేక సలహాలు ఇస్తూ ఉంటాడు అన్న సీక్రెట్ బయటపెట్టింది. ‘వి’ సినిమా కోసం తామంతా ఎంతో కష్టపడిన విషయాన్ని వివరిస్తూ వాస్తవానికి ఈ సినిమా ను ధియేటర్ లో చూస్తే బాగుంటుందని అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఓటీటీ లో విడుదల చేయడం తప్ప మరొక మార్గంలేదు అని అభిప్రాయపడింది. ఈ పరిస్థితులలో సినిమాలను జనం ఓటీటీ వేదికల పై చూస్తూ ఉన్నా తిరిగి ధియేటర్స్ ఓపెన్ అయితే జనం ధియేటర్స్ లకు వస్తారు అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది.