in

nivetha pethuraj reveals her alternate plan if no movie offers!

న‌ట‌న ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ సినీరంగ‌లో దూసుకుపోతున్న న‌టి నివేథా పేతురాజ్‌. విష్ణు హీరోగా న‌టించిన ‘మెంట‌ల్ మ‌దిలో’ చిత్రంతో నివేథా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. ‘చిత్ర ల‌హ‌రి’, ‘బ్రోచేవారెవ‌రురా’, ‘రెడ్’ వంటి సినిమాల‌తో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్ప‌ర‌చుకుంది. నివేథా మొద‌టి నుంచే న‌ట‌న ప్రాధాన్యమున్న పాత్ర‌లను ఎంచుకుంటూ వ‌స్తుంది. ఇటీవ‌లే ‘బ్ల‌డ్ మేరి’ వంటి వినూత్న క‌థ‌తో ఓటీటీలోకి కూడా అడుగుపెట్టింది.

చేసింది త‌క్కువ సినిమాలే అయినా త‌న అందం, అభిన‌యం ప్రేక్ష‌కుల‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్ర‌మంలో స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్‌పై స్పందిస్తూ ప‌లు ఆస‌క్తిక‌ర వాఖ్య‌లు చేసింది. నివేథా తాజాగా జ‌రిగిన ఓ ఇంట‌ర్వూలో మాట్లాడుతూ ‘హీరోయిన్ క‌న్నా న‌టిగా అనిపించుకోవ‌డం గ‌ర్వంగా ఉంటుంద‌ని తెలిపింది. హీరోయిన్‌గా సినిమాలు చేయ‌కపోతే కెరీర్ ఉండ‌దేమో అని చాలా మంది భ‌య‌ప‌డుతుంటారు.

నాకు ఆ భ‌యం లేదు. నేనెలాంటి బౌండ‌రీస్ పెట్టుకోలేదు. న‌ట‌న‌కు ఇంపార్టెన్స్ ఉంటే ఎలాంటి రోల్స్ అయినా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని వెళ్ళ‌డించింది. ఇక సినిమా ఆఫ‌ర్లు రాకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకుంటా’ అని తెలిపింది. నివేథా ప్ర‌స్తుతం రానా ‘విరాట‌ప‌ర్వం’లో కీల‌క‌పాత్ర‌లో న‌టించింది. దీనితో పాటుగా త‌మిళ్‌లో రెండు సినిమాల‌కు సైన్ చేసిన‌ట్లు స‌మాచారం.

Pragya Jaiswal stills at Mobile Launch event!

hot sensation Malavika Mohanan wants to romance Vijay Deverakonda!