in

hot sensation Malavika Mohanan wants to romance Vijay Deverakonda!

నటన కంటే అందాల ప్రదర్శనతోనే కోలీవుడ్‌లో క‌థానాయిక‌గా గుర్తింపును సొంతం చేసుకున్న‌ది మాళ‌వికా మోహ‌న‌న్‌. అందాల ఆర‌బోత విష‌యంలో త‌న‌కు హ‌ద్దులు లేవ‌ని గ‌త సినిమాల‌తో చాటిచెప్పింది. త‌మిళంలో ర‌జ‌నీకాంత్ తో పేట‌,  విజ‌య్‌తో మాస్ట‌ర్ సినిమాలు చేసింది మాళ‌వికా మోహ‌న‌న్‌. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. బుధ‌వారం ఈ ముద్దుగుమ్మ ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా తెలుగు హీరోల‌పై ఓ రేంజ్ లో ప్ర‌శంస‌లు కురిపించింది.

కోలీవుడ్ అగ్ర హీరోలు ర‌జ‌నీకాంత్, విజ‌య్ లతో న‌టించాల‌నే మీ క‌ల నెర‌వేరింది. వీరి త‌ర్వాత ఏ హీరోతో సినిమా చేయాల‌ని మీరు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌ని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ అని బ‌దులిచ్చింది మాళ‌వికా మోహ‌న‌న్‌. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో రొమాంటిక్ సినిమా చేయాలన్నది తన డ్రీమ్ అని బదులిచ్చింది. పుష్ప‌ సినిమాలో అల్లు అర్జున్ న‌ట‌న త‌న‌ను ఆక‌ట్టుకున్న‌ద‌ని మాళ‌వికా మోహ‌న‌న్ పేర్కొన్న‌ది.

మాస్ క్యారెక్ట‌ర్‌లో అల్లు అర్జున్ త‌న యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టాడ‌ని పేర్కొన్న‌ది. మ‌హేష్ బాబు స్టైలిష్ స్టార్ అని చెప్పింది. మ‌హ‌ర్షి షూటింగ్ స‌మ‌యంలో ఆయ‌న్ని క‌లిసి మాట్లాడాన‌ని, చాలా హంబుల్, స్వీట్ ప‌ర్స‌న్ అని పేర్కొన్న‌ది. పీరియాడిక‌ల్ సినిమాలో పోరాట యోధురాలైన యువ‌రాణి పాత్ర‌ను చేయాల‌నుంద‌ని బ‌దులిచ్చింది. పెళ్లి చేసుకునే ఆలోచ‌న త‌న‌కు ఇప్ప‌ట్లో లేద‌ని ప్ర‌స్తుతం సినిమాల‌పైనే దృష్టిసారించిన‌ట్లు మాళ‌వికా మోహ‌న‌న్ చెప్పింది..

nivetha pethuraj reveals her alternate plan if no movie offers!

Sony Charishta latest Photoshoot with a Horse!