కర్ణుడికి కవచ, కుండలాలు ఎంత సహజమో, దక్షిణాది హీరోలకు బిరుదులు అంతే సహజం, బిరుదు లేని హీరో అరుదు. ప్రతి హీరో కి యేవో కొన్ని సాంస్కృతిక సంస్థలు , లేదా అభిమాన సంఘాలు తమ అభిమానం కొలది ఏదో ఒక బిరుదు తో పిలుచుకుంటారు, అది వెండి తెర మీద వారి ఇంటి పేరు లాగా అంటిపెట్టుకొని ఉంటుంది. ఆ కోవకు చెందినవే నటరత్న, నట సామ్రాట్, నట భూషణ, నట కిరీటి వంటి పాత తరం బిరుదులు. ఆ తరువాతి కాలం లో ఇంగ్లీష్ టచ్ తో సూపర్ స్టార్ అని, సుప్రీమ్ హీరో, మెగా స్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, ఐకానిక్ స్టార్, నాచురల్ స్టార్, కంప్లీట్ స్టార్, మెగా ప్రిన్స్ ఇలా పరిణితి చెందాయి. ఇంగ్లీష్ మీడియం అభిమానుల అభిమానం కదా, అందుకే అటువంటి ఇంగ్లీష్ బిరుదులు. ఇప్పుడు ఈ గోల అంత ఎందుకు అంటే, కొత్తగా తెర మీదకు ఇంకో కొత్త బిరుదు వచ్చి చేరింది అదే ” నైట్రో స్టార్”
ఇదేమిటో హైటెక్ బిరుదు లాగా అనిపించింది, దీని అర్ధం ఏమిటో పెట్టిన వారో, పెట్టించుకున్నవారో చెపితే కానీ తెలిసేట్టు లేదు. ఇంతకీ ఎవరు ఈ నైట్రో స్టార్ అనే గ మీ సందేహం? ఆయనే సుధీర్ బాబు. సుమారుగా దశాబ్ద కాలంగా వెండి తెర మీద కనిపిస్తున్న నటుడు, ఇన్నేళ్ల నుంచి ఇండస్ట్రీ లో ఉంటున్న ఎంటువంటి బిరుదు లేని నటుడు, ఆ లోటు ఎందుకు అనుకున్నారో ఏమో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి. సంస్థ” నైట్రో స్టార్” అనే బిరుదు ఇచ్చింది. సుధీర్ బాబు బర్త్ డే సెలెబ్రేషన్స్ సందర్భంగా హర్షవర్ధన్ డైరెక్షన్ లో సుధీర్ బాబు చేస్తున్న సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టైటిల్, రిలీజ్ చేసారు అందులో “నైట్రో స్టార్ సుధీర్ బాబు” అనే పేరుతో తొలిసారి ప్రస్తావించారు. ఇక మీదట సుధీర్ బాబు” నైట్రో స్టార్” గ పిలవబడతారు, కానీ దీని మీనింగ్ ఏమిటి చెప్మా? అంటున్నారు సగటు ప్రేక్షకులు. హైటెక్ టైటిల్ కాబట్టి గూగుల్ తల్లి ని అడగమంటారా? అయితే ఒకే!