in

ABIMANIKI PADABHIVANDANAM CHESINA MEGA POWER STAR!

భిమాని కి పాదాభివందనం చేసిన మెగా పవర్ స్టార్. సాధారణంగా తమను కలవటానికి వచ్చిన అభిమాని తో ఫోటో దిగుతారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, ఆటోగ్రాఫ్ ఇస్తారు, కానీ రాంచరణ్ అంతగా పులకించిపోయి పాదాభివందనం చేసేంతగా ఆ అభిమాని ఏమి చేసారు. ఆ అభిమాని పేరు బొడ్డు శ్రీమతి, కరీంనగర్ వాసి, గృహిణి అయిన శ్రీమతి గారు అరుదైన నైపుణ్యం కలిగిన కళాకారిణి. వెదురు బొంగులు, చీపురు పుల్లలతో అద్భుతమయిన కళాఖండాలు తయారు చేస్తున్నారు. ఆవిడ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్ టవర్, లోటస్ టెంపుల్, మన హైటెక్ సిటీ వంటి బిల్డింగు నమూనాలు తయారు చేసి సెహబాష్ అనిపించుకున్నారు.

శ్రీమతి గారు మెగా ఫామిలీ కి వీర అభిమాని, ఈ క్రమంలో రామ్ చరణ్ కొత్తగా కట్టుకున్న ఇంటిని సహితం ఇలా పుల్లల్తో తయారు చేసి,ఆ మినియేచర్ ను రామ్ చరణ్ గత పుట్టిన రోజు నాడు బర్త్ డే గిఫ్ట్ గ ఇచ్చారు. ఆమె అభిమానానికి, ఆవిడ నైపుణ్యానికి ముగ్ధుడయిన రామ్ చరణ్ భావోద్వేగానికి లోనయి ఆవిడ పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. వయసులో పెద్ద వారయిన ఆవిడ చూపిన అభిమానానికి కృతజ్ఞత గ రామ్ చరణ్ ఆమె కు పాదాభివందనం చేయటం ఆయన సంస్కారానికి నిదర్శనం..

Telugu actress Navaneet Kaur in Blue Frock!

mirnalini ravi and eesha rebba locked for young hero!