in

NITHIN grabs NANI’S FILM FOR A SEQUEL?

నాని నటించిన ఎంసీఎ సినిమాకు సీక్వెల్ ప్లానింగ్ కూడా ఉంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో.. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’.. అప్పట్లో మంచి హిట్‌గా నిలిచింది. దాంతో ఇప్పుడు సీక్వెల్ చేయాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ చేసిన తర్వాత వేణు శ్రీరామ్ మరో సినిమా చేయలేదు. అల్లు అర్జున్‌తో చేయాలనుకున్న ఐకాన్ కూడా ఆగిపోయింది. అందుకే ఎంసీఎ మూవీకి సీక్వెల్ రంగం సిద్దం చేస్తున్నాడట. కాకపోతే ఈ సినిమాలో హీరోగా నాని కాకుండా.. నితిన్ నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు..

నాని ఇతర కమిట్మెంట్స్ వల్ల ఈ సీక్వెల్ చేయలేనని చెప్పేశారట. దాంతో నాని ప్లేస్‌లో నితిన్‌తో ప్లాన్ చేస్తున్నాడట దిల్ రాజు. నితిన్‌కు కూడా భీష్మ తరువాత సరైన హిట్ పడలేదు. ప్రస్తుతం వక్కంతం వంశీ, వెంకీ కుడుములతో సినిమలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఎంసీఏ సీక్వెల్‌ అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. మరి నిజంగానే ఈ సీక్వెల్‌ను నితిన్‌తో ప్లాన్ చేస్తున్నారా.. లేదంటే ఇద్దరితో మల్టీస్టారర్ ప్లానింగ్‌లో ఉన్నారా..అనేది తెలియాల్సి ఉంది..!!

Mallu Beauty malavika mohanan for Ustaad Bhagat Singh?

Das Ka Dhamki!