in

Mallu Beauty malavika mohanan for Ustaad Bhagat Singh?

అందం అభినయం కలబోసిన కుందనపు బొమ్మ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట సినిమాతో పరిచయం అయ్యింది మాళవిక. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. అందాల ఆరబోతలో అస్సలు ఏమాత్రం వెనకాడని ఈ మల్లు బేబీ కు సాలిడ్ హిట్ పడాలని కోరుకుంటున్నారు ఈ అమ్మడి అభిమానులు. మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను పలకరిస్తూ ఉంటుంది..

ఇకపోతే మాళవిక మోహనన్ నటించిన తెలుగు సినిమా ఒక్కటి కూడా నేరుగా విడుదల కాలేదు. అయితే డబ్బింగ్ సినిమాలు విజయ్ మాస్టర్, రజినీకాంత్ పేటతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆమె అయితే ఇప్పుడు ప్రభాస్, మారుతి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తికాకముందే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని సమాచారం. ఈ సినిమా తమిళ హిట్ తేరికి రీమేక్ ఇక తెలుగు నేటివిటీ కి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు..!!

‘Ravanasura’ will surprise you, says husharu girl Daksha nagarkar!

NITHIN grabs NANI’S FILM FOR A SEQUEL?