in

nidhi aggarwal pairs Prabhas Raja Deluxe Movie?

స్మార్ట్ శంకర్ సినిమా తరువాత టాలీవుడ్ లో కొద్దీ రోజులు హల్చల్ చేసిన ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘హరిహరవీరమల్లు’ లో నటిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ హుటాహుటిన మొదలై అర్థాంతరంగా ఆగిపోయింది. హరిహరవీరమల్లు సినిమా రిలీజైతే తన కెరీర్ కాసింతైన ముందుకెళ్తుందనుకుంటే ఆ సినిమా మధ్యలో ఆగిపోయి నిధి అగర్వాల్ కు మళ్ళీ అవకాశాల కోసం ఎదురుచూసే డెబ్యూ హీరోయిన్ పరిస్థితిని తీసుకొచ్చింది.

ఇక లేటెస్ట్ గా నిధి ఒక బంపర్ అఫర్ ను కొట్టేసిందని ఒక న్యూస్ వైరల్ గా మారింది. గతకొద్ది రోజులుగా షూటింగ్ లకు దూరంగా ఉంటున్న నిధి ఇటీవలనే హైదరాబాద్ కు చేరుకొని ఒక పెద్ద మూవీ ఆడిషన్ కు హాజరైందట. ఇంతకు ఆ సినిమా ఏంటా అనుకుంటున్నారా..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో రాబోతున్న ‘రాజా డీలక్స్’. ఈ సినిమాలో హీరోయిన్ కోసం గాను నిధి అగర్వాల్ ను సెలెక్ట్ చేసారంట. నిన్న నిధి అగర్వాల్ హైదరాబాద్ కు వచ్చి ఆడిషన్ కూడా ఇచ్చిందని టాక్ నడుస్తుంది. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుందట..!!

Sekhar Kammula gets Nagarjuna for Dhanush’s movie!

Rashmika upset by the hatred and negativity on social media?