in

nidhi agarwal’s birthday gift!

మిస్టర్‌ మజ్ను’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు నిధి అగర్వాల్‌ సుపరిచితురాలైంది. అటు బాలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నిధి పుట్టినరోజు నేడు (సోమవారం). కరోనా కారణంగా ఆమె బెంగుళూరులోని తన నివాసంలోనే బర్త్‌డే వేడుక జరుపుకుంటున్నారు. ‘సినీ కెరీర్‌ స్టార్ట్‌ చేసాక నా పుట్టినరోజులన్ని సెట్స్‌లో యూనిట్‌ సభ్యులు మధ్య కేక్‌ కటింగ్‌ సెలెబ్రేషన్స్‌తో జరిగేవి. ప్రస్తుతం కరోనా కారణంగా నటిస్తున్న సినిమాల చిత్రీకరణలు ఆగిపోవడంతో ఈ ఏడాది ఇంట్లోనే కుటుంబ సభ్యులతో బర్త్‌డే జరుపుకుంటున్నాను.

మహేష్‌ బాబు మేనల్లుడు గల్లా అశోక్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రంతోపాటు తమిళంలో ‘భూమి’ అనే చిత్రంలో నటిస్తున్నాను. వీటితో పాటు మరికొన్ని కొత్త కథలు వింటున్నారు. ఫేస్‌బుక్‌లో సరికొత్త రికార్డు సెట్‌ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ జనరేషన్‌ యంగ్‌ హీరోయిన్స్‌లో అత్యధికంగా 8.5 మిలియన్‌ ఫేస్‌బుక్‌ ఫాలోవర్స్‌తో నేను మొదటి స్థానంలో ఉండటం ఈ బర్త్‌డేకి దక్కిన గిఫ్ట్‌గా భావిస్తున్నాను’ అని నిధి తెలిపింది.

jr ntr’s brother in law into movies!

prabhas announced his new movie!