in

jr ntr’s brother in law into movies!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి బ్యాక్ గ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె తండ్రి నార్నే శ్రీనివాసరావు ప్రముఖ వ్యాపారవేత్త. ‘యన్’ టివి చానెల్ ఫౌండర్ అన్న సంగతి తెలిసిందే. నార్నే శ్రీనివాసరావు భార్య టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు బంధువు. కాగా ఫిల్మ్ నగర్ సమాచారమ్ మేరకు నార్నే శ్రీనివాసరావు తన తనయుడు నితిన్ ని హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.

నార్నే నితిన్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడంటే, తనకు బావ ఎన్టీఆర్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి, తన టాలెంట్ ని నిరూపించుకుంటే చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంది.మరి ఎన్టీఆర్ బావమరిది, నార్నే వారసుడు నితిన్ చిత్ర రంగప్రవేశం ఎలా ఉండబోతుందో వేచిచూద్దాం.

stylish star to romance saaho beauty!

nidhi agarwal’s birthday gift!