హీరో రామ్ తో కలిసి రెడ్ సినిమాలో నటిస్తోందీ మాళవిక శర్మ. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. తన ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకుంది మాళవిక శర్మ. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని ఎదురుచూస్తోంది. ఈ బ్యూటీ 2021లో కొత్త నిర్ణయాలు తీసుకుందట. ఈ ఏడాది తాను ఫిట్ నెస్ పై ఎక్కువ శ్రద్ద పెట్టాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. అంతేకాదు ఓ ఫిట్నెస్ ట్రైనర్, డైటీషియన్ ను నియమించుకొని బరువు పెరగాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. దక్షిణాది ప్రేక్షకులు కాస్త బొద్దుగా ఉండే హీరోయిన్లను ఎక్కువగా ఇష్టపడతారని, వారి కోసం తాను బరువు పెరగాలనుకుంటున్నానని తెలిపింది.