in

Nayanthara to play Stayadev’s wife in Lucifer remake?

టీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న చిరు ‘లూసిఫర్‌’ షూటింగ్‌ను ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీలో మిగతా తారగణం ఒక్కొరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. అయితే ఇందులో మెగాస్టార్‌ సోదరిగా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక నటుడు సత్యదేవ్‌ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒరిజినల్‌ వెర్షన్‌లో వివెక్‌ ఒబెరాయ్‌ పోషించిన పాత్రను తెలుగులో సత్యదేవ్‌ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ మూవీలో సత్యదేవ్‌కు నయనతార భార్యగా కనిపించనుందట. ఈ పాత్రకు నయన్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. సోలో హీరోగా స‌క్సెస్ రూట్‌లోకి వ‌చ్చిన స‌త్య‌దేవ్ కెరీర్కు ఈ చిత్రం పెద్ద ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. కాగా బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ చెందిన స్టార్‌ నటీనటులు ఈ మూవీలో భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..

Kanabadutaledu!

raghavendra rao gari tholi pandu padindhi aa heroin paine!