in

national crush Rashmika Mandanna To Romance Salman Khan!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మంచి జోరు మీద ఉంది. వరస అవకాశాలు అందుకుంటూ అన్ని భాషల్లో  సత్తా చాటుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. యానిమల్ సినిమాతో వచ్చిన గుర్తింపుతో రష్మికకి బాలీవుడ్ లో పలు ఆఫర్స్ వస్తున్నాయని టాక్. ఇప్పుడు కూడా  అలాంటి లక్కీ ఛాన్స్ ఒకటి రష్మికకి లభించింది.  బాలీవుడ్ కండల  వీరుడు సల్మాన్ ఖాన్ తో కోలీవుడ్ డైరక్టర్  మురుగ‌దాస్ ఒక సినిమా కమిట్ అయినట్టు ఎప్పటినుంచో వింటున్నాం.

ఈ మూవీలో మొదట త్రిష హీరోయిన్గా నటిస్తుంది అని ప్రచారం జరిగింది. తరవాత సమంత పేరు వినిపించింది. కానీ ఇప్పుడు ఈ ఆఫర్ రష్మికని వరించింది.  ఈ విషయాన్ని శ్రీవల్లి స్వయంగా పేర్కొంది. తన’ X ‘ఖాతా ద్వారా ఈ న్యూస్ ఫాన్స్ తో పంచుకుంది. రష్మిక యానిమల్ మూవీకి ముందు కొన్ని బాలీవుడ్ సినిమాలు చేసినా సరైన గుర్తింపు రాలేదు.  కానీ పుష్ప, యానిమల్ సినిమాలతో బాలీవుడ్ లో ఫామ్ లోకి వచ్చింది. దీనితో సల్మాన్ లాంటి స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసింది..!!

Mrunal Thakur feels Discomfort Doing Intimate Scenes!

Shruti Haasan to do an item song for venky mama!