తెలుగు చిత్ర సీమలో అదృష్టానికి కొత్త నిర్వచనం చెప్పి , సాహసానికి కేర్ అఫ్ అడ్రస్ గ వెలుగొందిన నట శేఖర కృష్ణ గారు. కృష్ణ గారు నిర్మాతల నటుడిగా మంచి పేరు ఉన్న నటుడు, ఆయనకు ఒక చిత్రమయిన అలవాటు ఉండేది ఆయన నటించిన చిత్రాల కలెక్షన్స్ పైసల తో సహా చెప్పే వారు. ఆయన నటించిన చిత్రాల జాతకం కూడా ముందే నిర్మొహమాటంగా చెప్పేసేవారు. కొంత మంది నటులు, దర్శకుల లాగ తమ చిత్రాలు అసాధారణమయినవి అని బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తాయి అని చెప్పటం ఆయన కు అలవాటు లేదు. కానీ కృష్ణ గారు మాత్రం తాను నటించిన చిత్రం అయినా సరే బాగుంటే బాగుందని, లేకుంటే ఆబ్బె ఈ సినిమా ఆడదు అని నిర్మొహమాటంగా చెప్పేసే వారు. అంతే గాని ఆయన ప్రొడక్షన్ విషయంలో గాని, స్టోరీ విషయం లో గాని, జోక్యం చేసుకొనే వారు కాదు, డైరెక్టర్ ఇస్ ది కెప్టెన్ అని నమ్మే వారు కృష్ణ గారు. సినిమా యొక్క జయాపజయాలతో సమబంధం లేకుండా 350 చిత్రాలు నటించిన ఘనత ఆయనకే సొంతం, రికార్డులు , సాహసాలు అన్ని ఆయన సొంత బ్యానర్ లోనే చేసేవారు తప్ప, ఇతర నిర్మాతలను ఇబ్బంది పెట్టేవారు కాదు..
సత్య చిత్ర వారు నిర్మించిన “కుమార్ రాజా” అనే చిత్రం లో కృష్ణ గారు త్రిపాత్రాభినయం చేసారు సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సంస్థ మీద ఉన్న నమ్మకం తో “ఉద్దండు” అనే సినిమా కు డేట్స్ ఇచ్చారు కృష్ణ గారు, షూటింగ్ మొదలయిన రెండవ రోజు సెట్ లో పరుచూరి బ్రదర్స్ చెప్పిన స్టోరీ విని, ఈ స్టోరీ ప్రొడ్యూసర్స్ విన్నారా? అని అడిగారట, విన్నారు అని చెప్పారట పరుచూరి, ఈ సినిమా అట్టర్ ప్లాప్ అవుతుంది, అని చెప్పారట కృష్ణ గారు, ఆ మాటలను విన్న పరుచూరి బ్రదర్స్ నోరు వేళ్ళ బెట్టారట. చెప్పటం వరకే, అంత కంటే జోక్యం చేసుకోకుండా చిత్రాన్ని పూర్తి చేశారట కృష్ణ గారు. ఆ చిత్రం రిలీజ్ అయి కృష్ణ గారు చెప్పినట్లుగానే అట్టర్ ప్లాప్ అయింది. నటుడి పని నటించటం జయాపజయాలతో నిమిత్తం లేదు, హిట్ అయితే తన ప్రతాపం లేకుంటే ఇతరుల తప్పు అని చెప్పి నెపం ఇతరుల మీద నెట్టేసే టైపు కాదు కృష్ణ గారు. ఏమయ్యా తీసిన ప్రతి సినిమా హిట్ అవుతుందా? అందులో కొన్ని ఫట్ లు కూడా ఉంటాయి అని చాల తేలికగా చెప్పేసే వారట కృష్ణ గారు. ఆయనకు సినిమా అంటే ఊపిరి, జీవితం అందుకే చీకటి, వెలుగులను సమానం గ తీసుకొని ముందుకు సాగిపోయారు..!!