in

narappa’s teaser release date announced!

మిళంలో సూప‌ర్ హిట్ చిత్రంగా నిలిచిన అసుర‌న్ ను తెలుగులో శ్రీకాంత్ అడ్డాల నార‌ప్ప టైటిల్ తో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. క‌లైపులి ఎస్ థాను, సురేశ్ బాబు నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నారు.ప్రియ‌మ‌ణి క‌థానాయిక‌గా న‌టిస్తుంది. రివెంజ్ డ్రామ్‌గా నార‌ప్ప చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఈ చిత్ర షూటింగ్ నిన్నటి నుండి ప్రారంభ‌మైంది.

డిసెంబ‌ర్ 13 వెంక‌టేష్ బ‌ర్త్ డే కావ‌డంతో ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నార‌ప్ప నుండి స‌ర్‌ప్రైజ్ వీడియో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ స‌ర్‌ప్రైజ్ వీడియో కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌తీకార కథాంశంతో రూపుదిద్దుకుంటున్న‌ ఈ చిత్రంలో మధ్యవయస్కుడైన వ్యక్తిగా వెంకటేష్‌ కనిపించబోతున్నారు. ప్రియ‌మ‌ణి ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో క‌నువిందు చేయ‌నుంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ismart girl nidhi agarwal learning tamil!

3 heroines fixed for sathya dev’s next!