in

‘narappa’ sparked an ugly fight on twitter, tollywood vs kollywood!

చిత్రంలో వెంకీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచార‌ని టాలీవుడ్ అభిమానులు అంటున్నారు.దీనికి కోలీవుడ్ అభిమానులు ధ‌నుష్‌ని ఏమాత్రం రీచ్ కాలేక‌పోయార‌ని ట్విట్ట‌ర్‌లో కామెంట్స్ చేస్తున్నారు. అమెజాన్ లో ‘నారప్ప’ స్ట్రీమింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో దీని గురించే తెలుగు – తమిళ ఆడియన్స్ మధ్య కామెంట్ల వార్ జరుగుతోంది. అసుర‌న్‌కి నార‌ప్ప‌కి సంబంధం లేకుండా సినిమా తీసి బోర్ కొట్టించార‌ని కోలీవుడ్ అభిమానులు అంటుంటే, వెంకటేష్ తన వయసుకు తగిన పాత్రలో అదరగొట్టాడని.. కొన్ని సన్నివేశాల్లో ధనుష్ ని మరిపించారని త‌మిళులు కాస్త అతి త‌గ్గించుకుంటే మంచిద‌ని..

ట్విట్ట‌ర్ వేదిక‌గా టాలీవుడ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఈ విధంగా ట్విట్టర్ లో పరస్పర విమర్శలు చేసుకుంటూ టాలీవుడ్ వెర్సెస్ కోలీవుడ్ అనే విధంగా ట్వీట్లు పెడుతున్నారు. గ‌తంలో త‌మిళ చిత్రాలు తెలుగులో భారీగా రీమేక్ అయి మంచి విజ‌యం సాధించిన ఇంత గొడ‌వ ఎప్పుడు జ‌ర‌గ‌లేదు. వెంక‌టేష్ నార‌ప్ప చిత్రం విష‌యంలో మాత్రం టాలీవుడ్ వ‌ర్సెస్ కోలీవుడ్ అన్న చందంగా మారింది. సెల‌బ్రిటీలు ఏ భేదం లేకుండా క‌లిసి ప‌ని చేస్తుంటే అభిమానులు ప్రాంతం, వ‌ర్గాలు అని చెప్పి నానా ర‌చ్చ చేస్తున్నార‌ని కొంద‌రు ఫైర్ అవుతున్నారు.

‘Chatrapathi’ VANDA ROJULA FUNCTION LO GODDALLU ICHINA NIRMATHA!

ismart beauty glamorous pics in half saree!