in

Nani’s ‘Shyam Singha Roy’ launched officially!

నేచురల్ స్టార్ నాని హీరోగా క్రియేటివ్ జీనియస్ రాహుల్ సాంకృత్యాన్ (‘టాక్సీవాలా’ ఫేమ్‌) డైరెక్ట్ చేస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం షూటింగ్ గురువారం ప్రారంభమైంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్‌. బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన దగ్గర్నుంచీ ప్రేక్షకుల్లో దీనిపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీలో ఇప్పటివరకూ చేయని అత్యంత ఆసక్తికర పాత్రను నాని చేస్తున్నారు.

నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి (‘ఉప్పెన’ ఫేమ్‌) నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్ (‘ప్రేమమ్’ ఫేమ్‌), రాహుల్ రవీంద్రన్‌, మురళీ శర్మ, అభినవ్‌ గోమటం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ తొలి చిత్రానికి సత్యదేవ్ జంగా కథను సమకూర్చగా, మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. సను జాన్ వర్ఘీస్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ నెలలోనే ‘శ్యామ్ సింగ రాయ్’ రెగ్యులర్ షూటింగ్ మొదలవనున్నది..

SUPER STAR MAHESH BABU IN EXTRACTION TELUGUSWAG EDITS

IIT Krishnamurthy!