in

nani’s ‘gang leader’ heroine signs 3 back to back movies!

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన `గ్యాంగ్ లీడ‌ర్` చిత్రంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలో తొలి అడుగేసింది ప్రియాంక అరుళ్ మోహ‌న్. అప్ప‌టికే ఓ క‌న్న‌డ సినిమా చేసిన ఈ చెన్నై పొన్నుకి.. ఫ‌స్ట్ టాలీవుడ్ ఎటెంప్ట్ ఆశించిన ఫ‌లితాన్ని అందివ్వ‌క‌పోయినా `శ్రీ‌కారం` రూపంలో మ‌రో ఛాన్స్ ద‌క్కింది. శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ.. బాక్సాఫీస్ విన్న‌ర్ కాలేక‌పోయింది. అయితే, `శ్రీ‌కారం` విడుద‌ల‌కు ముందే త‌మిళ చిత్రం `డాక్ట‌ర్`లో నాయిక‌గా ఎంపికైన ప్రియాంక‌.. ప్ర‌స్తుతం కోలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా మారుతోంది.

`డాక్ట‌ర్` త‌రువాత కోలీవుడ్ యంగ్ హీరో శివ‌కార్తికేయ‌న్ తోనే `డాన్` అనే మ‌రో సినిమా చేస్తున్న ప్రియాంక‌.. వెర్స‌టైల్ స్టార్ సూర్య‌కి జంట‌గా ఓ విలేజ్ డ్రామా చేస్తోంది. అంతేకాదు.. తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కూడా ఆమె వ‌శ‌మైంద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `త‌ల‌` అజిత్ హీరోగా హెచ్. వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో `నేర్కొండ పార్వై`, `వాలిమై` త‌రువాత ముచ్చ‌ట‌గా మూడో ప్రాజెక్ట్ రానున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ హీరోయిన్ గా ప్రియాంక సెలెక్ట్ అయింద‌ట‌. త్వ‌ర‌లోనే అజిత్ – వినోద్ థ‌ర్డ్ జాయింట్ వెంచ‌ర్ లో ప్రియాంక ఎంట్రీపై క్లారిటీ రానుంది. మ‌రి.. టాలీవుడ్ లో సాలిడ్ హిట్ లేని ప్రియాంక‌కి.. త‌మిళంలో అయినా ఆ ముచ్చ‌ట తీరుతుందేమో చూడాలి.

NERAVERANI CHIRANJEEVI GAARI HOLLYWOOD KALA!

Rajamouli complains about lack of facilities at Delhi airport!