in

nani reveals about anchor suma’s craze for movie events!

శ్యామ్ సింగ రాయ్’ రాయల్ ఈవెంట్ లో సుమపై హీరో నాని వేసిన పంచులు పేలాయి. నాని మాట్లాడుతూ “మామూలుగా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ హీరోల డేట్స్ కోసం వెయిట్ చేస్తారు. కానీ హీరోలంతా సుమ డేట్ల కోసం వెయిట్ చేస్తారు. మేము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు లేదా ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవచ్చు… ఏం చేయాలన్నా సరే సుమగారి డేట్ ఉందా ? అని ఆలోచిస్తాము. సుమ డేట్స్ ఉంటేనే ఈవెంట్ ప్లాన్ చేస్తాము.

సినిమా ఇండస్ట్రీలో హీరోలంతా ఒకరి డేట్స్ కోసం వెయిట్ చేస్తారంటే ఖచ్చితంగా అది సుమ గురించే ” అంటూ ఆమెకున్న క్రేజ్ గురించి చెప్పుకొచ్చారు. దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ యాంకర్ గా సుమదే అగ్రస్థానం. యాంకర్ గా ఆమె చేసే హడావిడి, సమయానుకూలంగా వేసే డైలాగులు, పంచులు, స్పాంటేనియస్, కామెడీ కలగలిపి సుమకు సరిలేరు ఎవ్వరూ అనేలా చేశాయి. ఇప్పటికీ బుల్లితెరపైనే కాకుండా సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా సుమ ఉండాల్సిందే.

సుమ అంటే పేరు కాదు నోరు అన్న విషయం అందరికీ తెలిసిందే. బ్యూటీ విత్ బ్రెయిన్ అనే పదం సుమను చూసే పుట్టి ఉంటుంది. అయితే సుమ ఎంత బిజీ అంటే…స్టార్ హీరోయిన్లకైనా కాస్త గ్యాప్ దొరుకుతుందేమో కానీ సుమ మాత్రం వరుస ఈవెంట్లతో బుల్లితెర కార్యక్రమాలతో ఫుల్ బిజీ. అంతేకాకుండా ఇటీవలే ‘జయమ్మ పంచాయతీ” అనే సినిమాతో చాలా ఏళ్ల తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది.

‘Shyam Singha Roy’ Trailer, Nani, Sai Pallavi, Krithi Shetty!

Narrow escape for MLA Roja from flight accident!