F2లో హనీ పాపగా అలరించిన హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లికి రెడీ అయ్యింది. గత నెలలలో భవ్య బిష్ణోయ్‌తో ఆమె వివాహం జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. పరిస్థితులన్ని చక్కబడగానే అందరి సమక్షంలో ఘనంగా వీరి వివాహ వేడుకను జరుపుకావాలని నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లి అనంతరం మెహ్రీన్ సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంది.
ఇక ఆమెపెళ్లి వాయిదా పడటంతో దర్శక-నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్లికి ఇంకా సమయంలో ఉండటంతో తమ సినిమా షూటింగ్స్ భాగం చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేగాక మెహ్రీన్ కూడా పెళ్లికి ముందే వీలైనన్ని ప్రాజెక్ట్స్ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో డైరెక్టర్ గోపిచంద్ మలినేని-నందమూరి బాలకృష్ణ కాంబోలో రాబోతున్న ఓ భారీ యాక్షన్ మూవీ కోసం మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.