in

Naga Chaitanya may join hands for Puri Jagannadh’s next?

తండేల్ తరవాత ఇంకా ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు చైతు. దూత సెకండ్ సీజన్ ఉంటుందని  తెలుస్తోంది. కానీ దీని పై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ టైమ్ లో చైతు చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ గూర్చి టాలీవుడ్ లో లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. పూరి జగన్నాథ్ తో చైతు ఒక ప్రాజెక్ట్ కి కమిట్ అయినట్టు తెలుస్తోంది. ‘లైగర్’ మూవీ డిజాస్టర్ కావటంతో పూరికి ఎవరు పెద్దగా  ఛాన్స్ ఇవ్వటం లేదు. ఇలాంటి టైంలో చైతు ఎందుకు పూరిని నమ్ముకుంటున్నాడు అని విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం పూరి రామ్ పోతినేనితో డబల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ తరవాత నాగ చైతన్యతో వర్క్ చేస్తాడని సమాచారం. నాగార్జున కి శివమణి లాంటి హిట్ ఇచ్చిన పూరి చైతూకి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి. పూరి సినిమాల్లో హీరో క్యారక్టరైజేషన్ ఒక రేంజ్ లో ఉంటుంది. డిఫరెంట్ మ్యానరిజం చూపించటానికి ఇష్ట పడతాడు. పోకిరిలో మహేష్, బుజ్జి గాడు లో ప్రభాస్, ఇస్మార్ట్ శంకర్ లో రామ్ లను ఇలాగే వైరిటీగా చూపించి వారిలో కొత్త కోణాన్ని ఎలివేట్ చేసాడు పూరి..!!

Vijay Deverakonda to give Double Treat for the 1st time?

f cube ‘Priyadarshi Pulikonda’!