హాస్య బ్రహ్మ జంధ్యాల, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి తోలి పరిచయం చాల నాటకీయం గ జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు కారులో వైజాగ్ నుంచి భీమిలి వెళుతున్నారు, దారిలో బాలయ్య బాబు కనిపించగానే కారు ఆపి, ఏమిటి ఇక్కడ అని పలకరించారు, జంధ్యాల గారి డైరెక్షన్ లో బాలయ్య బాబు నటించిన బాబాయ్ అబ్బాయి షూటింగ్ జరుగుంతుంది, రాజేంద్ర ప్రసాద్ ను జంధ్యాల గారికి పరిచయం చేసారు బాలయ్య, అదే వీరిద్దరి మొదటి పరిచయం. డ్రైవర్ పాత్రధారి అయిన ఒక నటుడు డైలాగ్ సరిగా చెప్పలేక 25 టేక్ లు తిన్నాడు, కానీ సీన్ సరిగా రావటం లేదు, వెంటనే జంధ్యాల గారు అతని చొక్కా తీసి రాజేంద్రుడి ఇచ్చి ఈ సీన్ మీరు చేయండి అన్నారట, అప్పటికే హీరో గ నటిస్తున్న రాజేంద్రుడు ఎస్, నో చెప్పలేక తటపటాయిస్తూనే ఆ సీన్ లో నటించి సింగల్ టేక్ లో ఒకే చేశారు.
ఆ తరువాత అడిగారట ఏంటి డైరెక్టర్ గారు, మరి జూనియర్ ఆర్టిస్ట్ చేసే క్యారెక్టర్ నా చేత చేయించారు అని వాపోయారట. అప్పుడు జంధ్యాల గారు ఏమో దేవుడు మనిద్దరిని ఇలా కలిపాడు, రేపు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు అంటూ, థాంక్స్ చెప్పారట. ఈ సంఘటన జరిగి రెండు నెలలు గడవక ముందే, జంధ్యాల గారి నుంచి పిలుపు వచ్చింది, తాను తీయబోతున్న” రెండు రెళ్ళ ఆరు” చిత్రంలో అవకాశం ఇచ్చారు ఆ తరువాత జంధ్యాల గారి డైరెక్షన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించారు రాజేంద్ర ప్రసాద్.