in

my dad beat me once in childhood: charan

తండ్రికి తగ్గ తనుడిగా రామ్ చరణ్ తెలుగు ఇండస్ట్రీ లో మంచి పేరును సంపాదించుకున్నారు.చిరు – చరణ్ తండ్రి కొడుకులు లా కాకుండా మంచి స్నేహితులు లాగా ఉంటారు అని అందరికీ తెల్సిందే..వీరిద్దరూ గొడవ పడిన సందర్భాలు కూడా తెల్సింది లేదు.అయితే ఇటీవల రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ లో తన చిన్న నాటి సంఘటన ను పంచుకున్నారు.

 ‘నా చిన్నతనంలో మా ఇంటి గేట్ దగ్గర మా డ్రైవర్ సెక్యూరిటీ మాట్లాడుకోవడం విన్నాను. నాకు వారు మాట్లాడుకున్న దానికి మీనింగ్ తెలియదు. దీంతో నేను వెళ్లి బాబాయ్ నాగబాబుని ఆ మాటలకు అర్థం ఏమిటని అడిగాను. అదే సమయంలో నాన్నగారు షూటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చారు. నాగ బాబాయ్ నాన్నని రూమ్ లోకి తీసుకెళ్లి చెర్రీ బ్యాడ్ వర్డ్స్ నేర్చుకుంటున్నాడు అని కంప్లైంట్ చేసాడు. వెంటనే రూమ్లో నుంచి బాబాయిని పంపిన నాన్న.. కోపంతో మా తాత గిఫ్ట్ గా ఇచ్చిన బెల్ట్ తీసుకొని నన్ను కొట్టారు. అవి మంచి మాటలు కాదని.. ఎప్పుడూ అలాంటివి మాట్లాడకని తరువాత చెప్పారు. ఈ ఘటన తరువాత నాగబాబు బాబాయితో నేను చాలా రోజుల వరకు మాట్లాడలేదు. ఆ తర్వాత నాన్న నా మీద ఎప్పుడు చేయి చేసుకోలేదు’ అని చెర్రీ తెలిపారు. అయితే ఇప్పటికీ నాన్నతో ఏదైనా చెప్పాలంటే ఆలోచిస్తూ ఉంటాను. కానీ ఉపాసన మాత్రం ఫ్రీ గా నాన్నగారితో మాట్లాడేస్తుంది. నాన్న ఉపాసన మామా కోడళ్ళులా కాకుండా స్నేహితులుగా ఉంటారు అని చెప్పుకొచ్చాడు

niharika special dance video!

i will quit movies : sai pallavi