కె. మురారి గారు నిర్మాతగా, “యువ చిత్ర” బ్యానర్ మీద ఎన్నో విజయవంతమయిన సినిమాలు తీసిన నిర్మాత. ఆయన తీసిన” గోరింటాకు” సినిమా కు దాసరి కంటే ముందు ఒక డైరెక్టర్ ని అనుకోని, తరువాత ఆయనను కాదనుకొని దాసరి గారిని డైరెక్టర్ గ పెట్టుకున్నారు. మురారి గారు దుక్కిపాటి మధుసూధన రావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గ పని చేసారు, దుక్కిపాటి గారికి దర్శక దూర్వాసుడు అని పేరు ఉండేది. మురారి గారు డైరెక్టర్ గ కాకుండా నిర్మాత గ మారి సినిమాలు తీశారు, నిర్మాత కు తన చిత్రం మీద పూర్తి పట్టు ఉండాలి అని నమ్మేవారు అయన. గోరింటాకు సినిమాకు సేతుమాధవన్ అనే మలయాళ డైరెక్టర్ ని తీసుకున్నారు, కాస్టింగ్ ఫైనలైజ్ అయింది..
మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎస్. విశ్వనాథన్ ని పెట్టుకుందామని చెప్పారు సేతుమాధవన్, కానీ మురారి గారు ఆనవాయితీగా తన చిత్రాలకు కే.వి.మహదేవన్ గారే మ్యూజిక్ డైరెక్టర్ గ ఉండాలి అని చెప్పారట, దానికి అభ్యంతరం చెప్పారట సేతుమాధవన్ గారు, అయితే నా చిత్రానికి డైరెక్టర్ గ మీరు అవసరం లేదు అని ఖరాఖండిగా చెప్పేసి, దాసరి నారాయణ రావు గారిని డైరెక్టర్ గ పెట్టి” గోరింటాకు” సినిమా తీశారు. నిర్మాతగా చిత్రానికి సంబంధించిన అన్ని విషయాలు తన కనుసన్నలలోనే జరగాలి అని నమ్మే వారు మురారి గారు. ఇప్పుడు ఉన్న నిర్మాతలు అసలు సెట్ కె రాకుడదు అని ముందుగానే అగ్రీమెంట్ చేసి, సినిమాలు తీస్తున్నారు డైరెక్టర్లు.