in

‘Murari’ 4K re release sets a new record with its bookings!

గష్టు 9న ఆయన పుట్టినరోజు సందర్భంగా 2001లో రిలీజ్ అయిన మహేష్ బాబు సూపర్ హిట్ మురారి సినిమా థియేటర్లలో మళ్ళి రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఆన్లైన్ లో స్టార్ట్ చేసారు. ఈ సినిమా టికెట్ ప్రీ-సేల్స్ లో అద్భుతమైన స్పందన వచ్చింది. మహేష్ బాబు అభిమానులు, ఫామిలీ ఆడియన్స్ భారీ సంఖ్యలో టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరుకు అడ్వాన్స్ బుకింగ్ల ద్వారా ఈ సినిమా ఒక కోటి రూపాయల గ్రాస్ కొల్లగొట్టింది..

ఇంకా 4 రోజులు ఉండగానే ఈ రేంజ్ లో టిక్కెట్లు అమ్ముడవడం చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. “మురారి” విడుదలకు ముందే, ప్రీ-సేల్స్ రికార్డులు సృష్టిస్తూ, ఇది మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత వ్యాప్తిగా మారింది. బుక్ మై షో, పేటీఎం లో టికెట్స్ విడుదల చేసారు. ఈ సినిమా 2001లో విడుదల అయి, ఇప్పటికీ అభిమానులను కట్టిపడేస్తోంది. “మురారి”లోని ఆకట్టుకునే కథ, గుండెను హత్తుకునే సంగీతం, ఫామిలీ ఎమోషన్స్ మరియు మహేష్ బాబుకు ఉన్న ప్రత్యేక ఫాలోయింగ్ ఈ సినిమాకు అద్భుతమైన అంశాలు..!!

Janhvi Kapoor’s Ulajh flops, all hopes on south cinema now!

keerthy suresh: vijay is better dancer than chiranjeevi