in

Mrunal Thakur Reveals She Is Single and likes Keanu Reeves!

సీతారామం సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు కూడా దగ్గరైన బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఆమె ప్రస్తుతం నానితో ‘హాయ్.. నాన్న’ సినిమాలో చేస్తోంది. ఇక బాలీవుడ్ లో ఆమె నటించిన ‘ఆంఖ్ మిచోలీ’ అక్టోబర్ 27 న విడుదల కానుంది. ఈ సినిమాలో అభిమన్యు దాసాని, పరేష్ రావల్ తదితరులు నటించారు. కళ్ళు కనిపించని యువతి పాత్రలో మృణాల్ కనిపించనుంది..

తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా మృణాల్ ఠాకూర్ తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి బయటపెట్టింది. తాను ప్రస్తుతం సింగిల్ గా ఉన్నానని తెలిపింది. పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో వాళ్లు నన్ను అడుగుతున్నారని తెలిపింది. ప్రస్తుతానికి అయితే పెళ్లిపై ఆసక్తి లేదని..కెరీర్‌పైనే ఫోకస్‌ పెట్టానని తెలిపింది. సీతారామం సినిమా తర్వాత తెలుగులో నన్ను అభిమానించే వారి సంఖ్య పెరిగిందని.. వారి అంచనాలకు తగిన విధంగా సినిమాలలో నటించాలనుకుంటున్నానని తెలిపింది..!!

Prema Vimanam!

19 years for SHANKAR DADA MBBS!