అందాల భామ మృణాల్ ఠాకూర్ గత ఏడాది విడుదలైన `సీతారామం` మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. నానితో కలిసి `హాయ్ నాన్న` అనే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మృణాల్ నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండతో కమిట్ అయింది. మరోవైపు తమిళంలో శివ కార్తికేయన్ కు జోడీగా..అలాగే బాలీవుడ్ లోనూ ఆఫర్లు అందుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న మృణాల్..తాజాగా ఓ భేటీలో పాల్గొంది.
ఈ సందర్భంగా మృణాల్ మాట్లాడుతూ..డబ్బు ఎక్కువగా ఇస్తున్నారని చెప్పి ఒకే భాషకే పరిమితమై చచ్చినా సినిమాలు చెయ్యనని, అన్ని భాషల్లో అన్ని రకాల పాత్రలు చేయడమే తనకు ఇష్టమని కుండబద్దలు కొట్టేసింది. ప్రస్తుతం అనేక భాషల్లో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నాని మృణాల్ తెలిపింది. ప్రేక్షకులు కూడా తన నుంచి ఇదే కోరుకుంటున్నారని ఆమె పేర్కొంది. మొత్తానికి కెరీర్ విషయంలో ఫుల్ ఫ్లానింగ్ తో ఉన్న మృణాల్.. ఒకే భాషకు పరిమితం అవ్వకుండా ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ చక్రం తిప్పాలని ఆశపడుతోంది..!!