మృణాల్ ఠాకూర్ గొడవ పడి మరీ ఒక పాత్రను లాక్కుందంట. ‘పూజా మేరీ జాన్’ అనే సినిమా విషయంలో ఇలా జరిగినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది మృణాల్. ఇది మృణాల్ కెరీర్లో లాంగ్ డిలేయ్డ్ మూవీ. ఈ సినిమా పనులు చాలా ఏళ్ల కిందట మొదలయ్యాయి. రెండేళ్ల కిందటే దీని చిత్రీకరణ పూర్తయింది. విడుదల మాత్రం ఆలస్యం అవుతోంది. ఈ ఏడాది చివర్లో ‘పూజా మేరీ జాన్’ రిలీజ్ కావచ్చని చెప్పిన మృణాల్..ఇందులో ప్రధాన పాత్ర కోసం తాను నిర్మాతలతో గొడవ పడ్డ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.
“పూజా మేరీ జాన్ కోసం ముందు నన్నే సంప్రదించారు. చాలాసార్లు ఆడిషన్ జరిగింది. నా కెరీర్లో అన్నిసార్లు ఆడిషన్ చేసిన సినిమా ఇంకోటి లేదు. ఆ పాత్రతో నేను ఎమోషనల్‌గా బాగా కనెక్టయ్యాను. ఐతే ముందు నాకు ఆఫర్ చేసిన పాత్రకు మరొకరిని ఎంచుకున్నారని తర్వాత తెలిసింది. నేను నిర్మాతలతో ఈ విషయమై గొడవ పడ్డాను. ఈ పాత్ర నాకే కావాలని అడుక్కున్నాను. చివరికి ఆ క్యారెక్టర్ నేనే చేశాను. ఆ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. ఈ ఏడాదే రిలీజవుతుందని అనుకుంటున్నా” అని మృణాల్ తెలిపింది..!!