in

Mohan Babu’s younger brother passes away!

విలక్షణ నటుడు మోహన్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు గుండెపోటుతో చనిపోయాడు..తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 63 ఏళ్ళ రంగస్వామి నాయుడు తుదిశ్వాస విడిచారు.ఛాతిలో నొప్పి రావడంతో తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ ఆయన ఈ సాయంత్రం కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. మోహన్‌బాబు సోదరుడు మరణంతో ఆయన ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు, స్నేహితులు మోహన్ బాబుకి తమ ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నారు. స్వతహాగా రైతుగా పనిచేస్తున్న రంగస్వామి నాయుడు చాలా ఏళ్లుగా మోహన్‌బాబు,అతని ఫ్యామిలీ నిర్వహిస్తున్న దాతృత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. గ్రౌండ్‌ లెవల్‌లో అన్ని పనులను చూసుకుంటూ ఉంటాడు. ఈరోజు తిరుపతిలో రంగస్వామి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని ఆత్మ కు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.

super busy Pooja Hegde Cannot Wait for Pawan Kalyan!

kriti shetty lip lock with star hero becomes hot topic!