in

kriti shetty lip lock with star hero becomes hot topic!

బంగార్రాజు సినిమాలో నాగలక్ష్మి అనే పాత్రలో కనిపించనుంది కృతి శెట్టి. నాగలక్ష్మి లుక్ ను నాగచైతన్య తన సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. అచ్చమైన పల్లెటూరి పిల్లలా.. మేడలో పూలమాలతో కళ్లజోడును స్టైలుగా పట్టుకున్న కృతి లుక్ ను రిలీజ్ చేశారు. కృతి ఈ పోస్టర్ లో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ సినిమాను జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే ఈ రోజు కృతి న‌టిస్తున్న శ్యామ్ సింగ‌రాయ్ టీజ‌ర్ కూడా విడుద‌లైంది. ఈ సినిమాలో సాయి పల్లవితో పాటు కృతి శెట్టి కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే టీజర్లో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఏం కన్పించలేదు. కానీ చివర్లో వచ్చిన సన్నివేశం మాత్రం అందరికి ట్విస్ట్ ఇచ్చింది. అందులో కృతిశెట్టి, నాని మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

లిప్ లాక్ వంటి స‌న్నివేశాల‌కు దూరంగా ఉండే కృతి ఇప్పుడు ముద్దు పెట్టడం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.తెరపై స్కిన్ షోలు, హాట్ రొమాన్స్‌లకు తాను ఒప్పుకోనని ముందుగానే ఈ యంగ్ బ్యూటీ స్పష్టం చేసింది. అయితే సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పిక్ ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. అందులో ఓ స్టార్ హీరోతో కృతి శెట్టి లిప్ లాక్ చేయడం కన్పిస్తోంది.. ఇది చూసి అంద‌రు షాక్ అవుతున్నారు.

Mohan Babu’s younger brother passes away!

sony charishta in blue sleeveless gown at queens lounge event!