1955 లో వచ్చిన “మిస్సమ్మ” చిత్రంలో యెన్.టి.ఆర్. హీరో పాత్ర పోషించగా, అక్కినేని గారు ఒక హాస్య పాత్రలో నటించారు. అది అక్కినేనిగారు ఏరి, కోరి నటించిన పాత్ర, దానికి కారణం ఏమిటంటే? అప్పటికే పలు చిత్రాలలో హీరోగా నటించిన అక్కినేని గారు విజయ సంస్థ లో ఒక్క చిత్రం కూడా నటించ లేదు, ఎలాగయినా విజయ వారి చిత్రంలో నటించాలి అనుకున్న అక్కినేని గారు, మిస్సమ్మ చిత్రం మొదలు పెడుతున్న సమయం లో నాగి రెడ్డి గారి ని కలిసి, మీ మిస్సమ్మ చిత్రంలో నేను కూడా నటిస్తాను, నాకు కూడా అవకాశం ఇవ్వండి అని అడిగారట.
మిస్సమ్మ లో ఆల్రెడీ యెన్.టి.ఆర్. హీరోగా ఉన్నారు, మరి మీరు నటించదగిన పాత్ర చిత్రంలో లేదే అన్నారట నాగి రెడ్డి గారు, అందులో ఉన్న ఒక హాస్య పాత్ర నేను చేస్తాను అని సంసిద్ధత తెలియ చేశారట, దానికి ఒకింత ఆశ్ఛర్య పోయిన నాగి రెడ్డి గారు అలాగే అని చెప్పి. నాగేశ్వర రావు నటిస్తున్నారు కాబట్టి ఆ పాత్ర ప్రాముఖ్యతను, నిడివిని పెంచి చిత్రీకరించటం జరిగింది. అందులో సెల్ఫ్ డిక్లేర్డ్ డిటెక్టీవ్ గ నటించి, తనదైన శైలిలో హాస్యాన్ని పండించారు అక్కినేని నాగేశ్వర్ రావు గారు.