in

kollywood star Dhanush announces first Telugu film titled ‘Sir’!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు దర్శకుల పై మొగ్గుచూపుతున్నాడు. ధనుష్ నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈ వర్సటైల్ యాక్టర్ బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నాడు. అత్రంగి రే అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ధనుష్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు.

ముందుగా యంగ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆతర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్‌ మజ్ఞు’, ‘రంగ్‌దే’లాంటి విభిన్న ప్రేమకథ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. తాజాగా వెంకీ అట్లూరి సినిమా టైటిల్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘సార్’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. టైటిల్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమాలో ధనుష్ టీచర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది..

‘MISSAMMA’ MOVIE LO DITECTIVE GA COMEDY PANDINCHINA AKKINENI!

AP Theaters Issue Is An Insult To Audience, says Nani!