ఇద్దరు పాపులర్ హీరోలు కలసి ఒకే చిత్రంలో నటిస్తే ఫాన్స్ కి పండగ, సగటు ప్రేక్షకుడికి కన్నుల పండగ, నిర్మాతలకు కలెక్షన్ల పండగ. నాటి గుండమ్మ కథ నుంచి నేటి ఆర్.ఆర్.ఆర్. వరకు ఈ విషయం నిరూపితం అయింది. కొన్ని సంవత్సరాల క్రితం ఇటువంటి సూపర్ కాంబో ఒకటి మిస్ అయింది. సినిమా అన్నాక కొన్ని కాంబోలు మిస్ అవటం, కొన్ని మిస్ ఫైర్ అవటం కూడా సహజమే. స్టార్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు, చిరు,బాలయ్య కాంబినేషన్ లో ఒక చిత్రం తీయాలని ఒక అపూర్వమయిన కథను వండారు, ఆ వంటకాన్ని వీరికి రుచి చూపించగా ఇద్దరు హీరోలు, అహో! బహు బాగున్నది! అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ముహూర్తానికి ఇద్దరు ఒకే రకం డ్రెస్సులు వేసుకొని మరి వచ్చి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గ నిలిచింది ఈ న్యూస్. ఏమయిందో ఏమో చిరు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేసారు కొద్దీ రోజులకు, చిరు ఎందుకు తప్పుకున్నారో చెప్పలేదు.
కానీ బాలయ్య వెనుకకు తగ్గకుండా తానే రెండు పాత్రలలో నటిస్తానని ప్రాజెక్ట్ ఆప వద్దని భరోసా ఇచ్చారు. అలా “అపూర్వ సహోదరులు” చిత్రంలో బాలయ్య డబల్ రోల్ చేసారు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసింది, అదే చిరు, బాలయ్య కాంబినేషన్ లో వచ్చి ఉంటె ఎలా ఉండేదో ఊహించుకుంటే, కొంత నిరాశ కలుగుతుంది. కారణాలు ఏమిటో తెలియదు కానీ తెలుగు చిత్రసీమలో మొదటి తరం, రెండవ తరం నటులతో వచ్చినన్ని కాంబినేషన్ చిత్రాలు ఆ తరువాత రాలేదు, ప్రయత్నాలయితే జరిగాయి కానీ అవి ఫలించ లేదు. మళ్ళీ ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ మొదలయిందేమో అనిపిస్తుంది “గోపాల గోపాల” “ఎఫ్.2 , ఎఫ్ 3 “ఆర్.ఆర్.ఆర్”. వంటి సినిమాలు చూస్తుంటే. చూద్దాం తెలుగు ప్రేక్షకులకు మరిన్ని గ్రేట్ కాంబినేషన్లు చూసే యోగం ఉందొ? లేదో?