రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా ఈ వైరస్ అందరికీ సోకుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా ప్రముఖ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా బారిన పడింది. హైదరాబాద్ లో ఓ వెబ్ సిరీస్ కోసం షూటింగ్ లో పాల్గొన్న సమయంలో ఆమెకు కరోనా సోకింది. విపరీతంగా జ్వరం రావడంతో టెస్ట్ చేయించుకున్న తమన్నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటుంది. ప్రస్తుతం తాను కరోనా నుండి కోలుకున్న విషయాన్ని తెలియజేస్తూ ఓ లేఖని విడుదల చేసింది తమన్నా.
సెట్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా ఎలా సోకిందో అర్ధంకావడంలేదు.జ్వరం రావడంతో టెస్ట్ చేయించుకున్న పాజిటివ్ అని తేలింది. వెంటనే హైదరాబాద్ లో ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఇప్పుడు నిపుణులైన వైద్యుల సంరక్షణలో ట్రీట్‌మెంట్ అనంతరం.. డాక్టర్ల సలహాతో నేనిప్పుడు డిశ్చార్జ్ అయ్యాను. ఈ మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవడం అదృష్టంగా భావిస్తున్నా .. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. నాకోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.అని తమన్నా తన లేఖలో తెలిపింది.