తెలుగు ప్రేక్షకులకు మిడిల్ క్లాస్ మెలోడీస్ వినిపించిన వినోద్ ఆనంతోజు, తెలుగునాట ప్రేక్షకులందరి మన్నన పొందటమే కాదు, వాహిని వారి కాలం నుంచి నేటి తరం వరకు నిత్య విద్యార్థి లాగా కొత్త ప్రయోగాలు చేస్తూ ఎనభై లో కూడా ఇరవై లాగా ఆలోచించే సింగీతం శ్రీనివాస రావు గారి ప్రసంశలు పొందటం చాల అరుదైన అనుభూతి. వినోద్ ఆనంతోజు బండి మీద వెళుతుండగా, మంచి ట్రాఫిక్ లో ఉండగా సెల్ ఫోన్ మోగింది, అవతల నుండి మాట్లాడుతున్నది సింగీతం గారు అని వినగానే బండి అపి, ప్రక్కనే ఉన్న గల్లీలోని షాప్ లోకి వెళ్లి మాట్లాడారట వినోద్. అంత అనుభవశాలి అయిన డైరెక్టర్ ఫోన్ చేసి, మెచ్చుకోవటమో, ఆశీర్వదించటమో కాకుండ చాల బాగా చేసావు, ఆ షాట్ లో ఆ ఫ్రేమ్ ఎలా చేసావు , ఇంకొ షాట్ లో లైటింగ్ ఎలా మేనేజ్ చేసావు అని అడుగుతుంటే, సినిమా మీద ఆయనకు ఉన్న ఇంటరెస్ట్, తనలాంటి ఏక్ సినిమా డైరెక్టర్ వద్ద నుంచి కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకునే ఆయన ఆసక్తి తెలిసి ఆశ్ఛర్య పోయారట.
సింగీతం గారిలాంటి దిగ్గజ డైరెక్టర్ నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు అంటే అదే పెద్ద రివార్డ్ గ ఫీల్ అవటమే కాకా ప్రతి ఒక కళాకారుడు నిత్య విద్యార్ధి లాగా కొత్త విషయాలు నేర్చుకుంటేనే ఎక్కువ కాలం మన గలరు అనే గొప్ప జీవిత సత్యాన్ని సింగీతం గారు తెలియ చేసారని వినోద్ వినమ్రంగా చెప్పుకున్నారు. తెలుగు సినీ తెర మీద అంతర్ధానం అయిపోయిన మిడిల్ క్లాస్ కధలను మళ్ళీ సెల్యూలాయిడ్ మీదకు తీసుకొని వచ్చి తెలుగువారి మన్ననలు పొందిన వినోద్ ఆనంతోజు మరిన్ని మిడిల్ క్లాస్ మెలోడీస్ వినిపించాలని కోరుకొందాం.