in

Megastar Chiranjeevi’s daughter Sushmita turns producer!

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి ఇప్పటికే అనేక మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. దగ్గరదగ్గర డజను మంది వరకు ఇండస్ట్రీలో ఉన్నారు. చిరు అబ్బాయిల్నే కాదు అమ్మాయిల్ని సైతం ఎంకరేజ్ చేస్తారు. ఆయన ఫ్యామిలీ నుండి నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మరొక అమ్మాయి నుండి వెండి తెర మీదకు ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఆమే చిరు పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల. సుస్మితకు ఇండస్ట్రీ కొత్తేమీ కాదు.

ఆల్రెడీ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆమెకు మంచి పేరుంది. తండ్రి చిరు, సోదరుడు రామ్ చరణ్ సినిమాలకు ఆమె పనిచేస్తుంటారు. ఇప్పుడు ఒక వెబ్ ఫిలిం నిర్మించే పనిలో ఉన్నారు. దీనికి పవన్ సాధినేని దర్శకత్వం వహించనున్నారు. ఇది అయ్యాక థియేటర్ ఫిలిమ్స్ నిర్మించాలనేది సుస్మిత ఆలోచనట. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుండి ఇంకొక నిర్మాత బయటకు రానుంది. ఇప్పటికే రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నిర్మాతలుగా వ్యవహరిస్తూ పలు సినిమాలను తెరకెక్కించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే.

Bellamkonda Sreenivas to star in the Telugu remake of ‘Karnan’!

mass maharaja, the only hero with half-dozen movies in hand!