in

meenakshi chowdhary silently escapes from guntur kaaram effect!

గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి పాత్రని తీర్చిదిద్దిన విధానం చూశాక అభిమానులకు కలిగిన అభిప్రాయం కూడా అదే. కేవలం ఆమ్లెట్ వేసి జయరాం, మహేష్ బాబుకి తెచ్చివ్వడం తప్ప ఆమె సినిమా మొత్తంలో ఏం చేసిందంటే సమాధానం చెప్పడం కష్టం. బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఏమో కానీ ఫలితం ఆ స్థాయిలో రాకపోవడంతో శ్రీలీలకు దక్కిన ప్రయోజనమే ఏమీ లేదు. కానీ మీనాక్షి చౌదరికి ఈ రిజల్ట్ వల్ల ఎలాంటి బెంగ లేదు.

ప్రస్తుతం తన చేతిలో క్రేజీ ప్రాజెక్టులున్నాయి. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ప్రకటించాక ‘GOAT’ మీద అంచనాలు రెట్టింపయ్యాయి. ఇందులో మీనాక్షినే హీరోయిన్. వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్ సేన్ 10, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ఆల్రెడీ సెట్ల మీద ఉన్నాయి. తాజాగా చిరంజీవి ‘విశ్వంభర’లోనూ దేవకన్యగా ఆఫర్ వచ్చిందని టాక్. ఈ లెక్కన గుంటూరు కారం తాలూకు ఎఫెక్ట్ తన మీద ఎంత మాత్రం లేదని అర్థమవుతోందిగా..!!

9 years for ‘MALLI MALLI IDI RANI ROJU’!

big boss amardeep and supritha naidu’s film launched!