in

mass maharaja to romance 5 heroines in ‘ravanasura’!

సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో 10 గెటప్ లలో రవితేజ కనిపించబోతున్నాడు. అలాగే అక్కినేని సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్స్ విషయమై ఓ అప్డేట్ బయటకు వచ్చింది.

అదేంటంటే ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్స్ ఉన్నారట. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నడ, అలాగే దక్ష నగర్కర్ లను మేకర్స్ సెలెక్ట్ చేశారట.అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా రవితేజ ప్రస్తుతం రావణాసుర సినిమాతో పాటు ఖిలాడి, టైగర్ నాగేశ్వరరావు బయోపిక్, ధమాకా, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు చేస్తున్నాడు.

Samantha deletes divorce post from social media!

Is Actress Meera Jasmine Making a Re-entry in tollywood?