in

mass maharaja to repeat ‘power’ movie combination!

ర‌వితేజ `ప‌వర్‌`తో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చాడు బాబీ. ఆ త‌ర‌వాత మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్ గా నిలిచాడు. చిరంజీవితో తీసిన ‘వాల్తేరు వీర‌య్య‌’ పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి `వీర మాస్` అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది. దీని త‌ర‌వాత బాబీ చేయ‌బోయే సినిమాపై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చింది. మ‌ళ్లీ ఆయ‌న ర‌వితేజ‌తో జ‌ట్టు క‌ట్టే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

వీరిద్ద‌రి కాంబోలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మించే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం బాబీ – ర‌వితేజ మ‌ధ్య క‌థా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయని టాక్‌. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీలో వ‌రుస‌గా సినిమాలు చేసేస్తున్నాడు ర‌వితేజ‌. ‘ధ‌మాకా’తో వీరి కాంబో బాగా సెట్ అయ్యింది. ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్‌తో చేస్తున్న ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌’ని కూడా పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీనే తెర‌కెక్కిస్తోంది. బాబీతో పీపుల్ మీడియా ఇది వ‌ర‌కు ‘వెంకీ మామా’ సినిమాని రూపొందించింది..!!

rx100 ante mamuluga undadhu mari

actress Poonam Kaur sensational comments on trivikram’s character!