నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. తిరిగి చిత్రీకరణను స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు బృందం. ఈ సినిమా బాలయ్య, బోయపాటిల కలయికలో వస్తున్న మూడవ చిత్రం. వీరిద్దరూ చేసిన గత చిత్రాలు ‘సింహ, లెజెండ్’ భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో వీరి మూడవ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇన్నాళ్లు ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ సెట్ అవలేదు.
బోయపాటి శ్రీను ఎందరో హీరోయిన్ల పేర్లు పరిశీలించినా ఎవ్వరూ కుదరలేదు. బాలయ్య పక్కన ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని భావించిన బోయపాటి ఎంతో వెతుకులాట తర్వాత మలయాళ నటి ప్రగ్యా మార్టిన్ పేరును కన్ఫర్మ్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఇంకా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రగ్యా మార్టిన్ మలయాళంలోనే కాకుండా తమిళంలో కూడ నటించింది. తమిళంలో ఆమె మొదటి చిత్రం మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన ‘పిశాసు’. ఈ చిత్రానికి గాను ఆమె బెస్ట్ డెబ్యూ నటిగా అవార్డ్ కూడ అందుకుంది