in

mahesh babu to produce web series soon!

మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నా.. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు. ఆ తరువాత వంశీ పైడిపల్లి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్నాడని రూమర్స్ వచ్చాయి. ఒకవేళ ఈ రూమర్స్ నిజం అయినా.. చరణ్ ఇప్పట్లో డేట్స్ ఇచ్చే పరిస్తితిలో లేడు. చరణ్ తో సినిమా స్టార్ట్ చేయాలి అంటే.. మరో రెండేళ్లు ఆగాలి. అందుకే వంశీ పైడిపల్లి ఈ లోపు ఓ వెబ్ సిరీస్‌ చేయడానికి ఓకే చెప్పారట. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆ వెబ్ సిరీస్ మహేష్ బాబు నిర్మాణంలో రాబోతోందట. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే ఆల్ రెడీ సినిమా నిర్మాణం కూడా చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఎంబీ ప్రొడక్షన్స్ అనే తన ఓన్ ప్రొడక్షన్ కంపెనీ పెట్టి.. తన ప్రతి సినిమాని ఈ కంపెనీలో ఇన్ వాల్వ్ చేస్తున్నారు మహేష్. పైగా తన ప్రొడక్షన్ కంపెనీలో తన సినిమాలనే కాకుండా బయట హీరోలతో కూడా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ.. తన ప్రొడక్షన్ కంపెనీని ఇంకా విస్తృత పరుస్తున్నాడు. ఇప్పటికే మల్టీ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా వస్తోన్న ‘మేజర్’ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇప్పుడు వంశీతో వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఇక వంశీ – మహేష్ కలయికలో వచ్చిన మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

jaya prakash reddy passes away!

bunny thanks vijay devarakonda!