in

Mahesh Babu to play Lord Krishna in ‘Devaki Nandana Vasudeva?

రాజకీయ నాయకుడు, పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్‌ కుమారుడు అశోక్‌ గల్లా ‘హీరో’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. అశోక్‌ నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్‌ జంధ్యాల దర్శకుడు. డివోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్‌ 14న  ప్రేక్షకుల ముందుకు రానుంది. మానస వారణాసి నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు.

‘హనుమాన్‌’ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఈ చిత్రానికి కథను అందించడం విశేషం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో టాలీవుడ్‌ క్రేజీ కథానాయకుడు మహేశ్ బాబు అతిథిగా పాత్ర చేస్తున్నాడని, పతాక సన్నివేశాల్లో వచ్చే శ్రీకృష్ణుడి ఉగ్రస్వరూపం పాత్రకు మహేశ్ సూట్‌ అవుతాడని, ఆయనను ఒప్పించి చిత్రీకరణ చేశారనే వార్త ప్రచారంలో వుంది..!!

pooja Hegde: i will not repeat that mistake again