ప్రస్తుతం తోటి హీరోలందరూ రెండు మూడేసి సినిమాలు లైన్లో పెట్టగా మహేష్ కూడా తర్వాత సినిమాకు కథా చర్చలు సాగిస్తున్నాడు. ఈక్రమంలోనే సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా ఖరారైంది. ఇదిలా ఉండగానే మహేష్ మరో దర్శకురాలి కథకు ఒకే చెప్పినట్లుగా తాజా సమాచారం ఒకటి ఆసక్తిగా మారింది. మహేష్ ఒకే చెప్పిన దర్శకురాలు ఎవరో కాదు.. లేడీ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సుధా కొంగర.