ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ భారతీయ సినిమా రంగానికి అందించిన సేవలను గుర్తించింది భారతదేశ ప్రభుత్వం. ఎన్నో దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో, నృత్యంతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన మాధురి దీక్షిత్ ను ఒక ప్రత్యేక గౌరవంతో సత్కరించింది. ప్రస్తుతం గోవా లో జరుగుతున్న “ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అఫ్ ఇండియా” వేదికగా “స్పెషల్ రెకగ్నిషన్ ఫర్ కాంట్రిబ్యూషన్ తో ఇండియన్ సినిమా” పురస్కారంతో సత్కరించారు.
ఈ విషయాన్నీ యూనియన్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మినిస్టర్ శ్రీ అనురాగ్ ఠాకూర్ గారు సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. “ఎన్నో దశాబ్దాలపాటు తన విలక్షణ నటనతో సాటి లేని ప్రతిభతో భారతీయ సినిమాకు తన సేవలనందించిన మాధురి దీక్షిత్ గారిని స్పెషల్ రెకగ్నిషన్ ఫర్ కాంట్రిబ్యూషన్ తో ఇండియన్ సినిమా అవార్డుతో సత్కరించడం జరిగింది” అని ఆయన ఎక్స్ లో రాసుకొచ్చారు..!!