మాబాలయ్య బంగారం అంటారు సినీ జనం, దానికి ఎన్నో ఉదాహరణలు, ఎందరో సాక్షులు. రెండు సినిమాలు హిట్ అవగానే ఏదో ఆకాశం నుంచి దిగి వచ్చాము అన్నట్లు గ,కారవాన్ లోనే పుట్టాము అన్నట్లు ప్రవర్తిస్తారు కొంత మంది. యెంత ఎదిగిన మనం నిలబడవలసింది భూమి మీదే, తినేది అన్నమే అన్నట్లు, ఎటువంటి భేషజాలకు పోకుండా “డౌన్ టు ఎర్త్” ఉండే బహు కొద్దిమంది హీరోలలో బాలయ్య బాబు మొదటి వరసలో ఉంటారు. అటువంటి ఒక అనుభవం తమ్మారెడ్డి భరద్వాజ గారి నోటివెంట.ఫిలిం ఛాంబర్ ద్వారా గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ముఖ్య అతిధి గ ఆహ్వానం అందుకున్న బాలకృష్ణ గారు, తమ్మా రెడ్డి భరద్వాజ తో కలసి గోవా వెళ్లారు. ఎయిర్ పోర్ట్ కి ఆహ్వానం పలకడానికి ఎవరు రాలేదు,ఎవరో ఒకరు ప్లకార్డు పట్టుకొని నిలబడి ఆహ్వానించాడు, సాధారణం అయిన కార్ పంపారు .
అది గమనించిన భరద్వాజ గారు ఏంటి బాబు, వీళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు, అదే బొంబాయి హీరోలయితే రెడ్ కార్పెట్ పరిచి, పడి, పడి, సలాములు చేస్తారు వీళ్ళు, మనకి అవసరమా ఈ ఫంక్షన్ అన్నారట. అది విన్న బాలయ్య, నన్ను ముఖ్య అతిధి గ పిలవటం ఒక గౌరవం, ఆ గౌరవం సినిమా వలన వచ్చింది, మనం వచ్చింది సినిమా ఫంక్షన్ కి కాబట్టి, మన వలన సినిమా ఫంక్షన్ కి ఎటువంటి ఇబ్బంది కలగ కూడదు, మనం ఇతర విషయాలు లైట్ తీకోవటం బెటర్ అన్నారట. కార్ లో హోటల్ గదికి బయలు దేరిన బాలయ్య దారిలో కార్ ఆపి, తానే స్వయంగ వెళ్లి మినరల్ వాటర్ బాటిల్స్ కొని కార్ లో పెట్టారట, అది చూసిన భరద్వాజ గారు ఎందుకు బాబు హోటల్ లో ఇస్తారు కదా అనగానే, ఇస్తారు, కానీ బయట పది రూపాయలకు దొరికే వాటర్ బాటిల్ కి రెండు వందలు ఛార్జ్ చేస్తారు, నిర్వాహకులు ఇస్తారు కదా అని మనం డబ్బులు వేస్ట్ చేయటం ఎందుకు అన్నారట. అది! బాలయ్య అంటే, అందుకే మా బాలయ్య బంగారం…