in

leading lady locked for balayya – bobby film!

మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘విశ్వంభర’ త్వరలోనే మొదలవుతుండగా ఇంకా కథానాయిక ఖరారు కాలేదు..అలాగే సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ-బాబీ కాంబినేషన్లో మొదలైన సినిమాకు కూడా హీరోయిన్ ఫిక్స్ చేయకుండానే షూటింగ్‌కు వెళ్లిపోయారు. రెండు షెడ్యూళ్ల చిత్రీకరణ కూడా పూర్తయింది. ఐతే షూటింగ్ మధ్య దశకు చేరుకున్న ఈ చిత్రానికి ఎట్టకేలకు హీరోయిన్ ఓకే అయింది.

కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్‌ను బాలయ్యకు జోడీగా ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. నాని ‘జెర్సీ’, సిద్ధు జొన్నలగడ్డ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించిన శ్రద్ధ.. ఇటీవలే ‘సైంధవ్’ చిత్రంతో పలకరించింది. ఆ సినిమా, అందులో శ్రద్ధ పాత్ర పెద్దగా ఇంపాక్ట్ వేయలేకపోయాయి. ఐతే సీనియర్ హీరో పక్కన శ్రద్ధ బాగానే సూటైంది అనిపించింది. దీంతో బాలయ్యకు జోడీగా ఆమెను ఎంపిక చేశారు..!!

Poonam Kaur Suffering From a rare disease Fibromyalgia!

Ambajipeta Marriage Band!