in

kriti sanon in dating UK-based businessman Kabir Bahia?

దిపురుష్ చిత్ర ప్ర‌మోష‌న్ స‌మ‌యంలో ప్ర‌భాస్, కృతి స‌న‌న్ ప్రేమ‌లో ఉన్నారంటూ తెగ ప్ర‌చారాలు సాగాయి. ఓ షోలో వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ కూడా ఈ రూమర్స్ కి మరింత ఆజ్యం పోసింది. అయితే కృతి సనన్ ఈ వార్తలను ఖండించింది. తాము కేవలం మిత్రులమే, మా మ‌ధ్య అలాంటివి ఏమి లేవ‌ని క్లారిటీ ఇచ్చింది. ఇక కృతి స‌న‌న్.. గతంలో దివంగత నటుడు సుశాంత్ రాజ్ పుత్ తో కూడా కృతి సనన్ ఎఫైర్ నడిపిందనే వాదన ఉంది. ఇక ప్ర‌స్తుతం క‌బీర్ బ‌హియా అనే వ్య‌క్తితో ప్రేమాయ‌ణం న‌డుపుతున్న‌ట్టు ప్ర‌చారం న‌డుస్తుంది.

కృతి సనన్ బర్త్ డే పార్టీకి కూడా కబీర్ హాజరయ్యాడని , ఇద్దరూ చేయి చేయి పట్టుకుని విదేశీ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో వారిద్ద‌రు ప్రేమ‌లో ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.దీనిపై కృతి ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు. అయితే అస‌లు ఈ క‌బీర్ బ‌హియా ఎవ‌రు అనేది చూస్తే..లండన్ కి చెందిన ఈ 24 ఏళ్ల కుర్రాడు సంపన్నుల కుటుంబంలో జ‌న్మించాడు. తండ్రి కుల్విన్దర్ బహియా యూకేలో సౌథాల్ ట్రావెల్ పేరుతో ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారు. కబీర్ ఆస్తుల విలువ రూ. 45 వేల కోట్లకు పైమాటే ఉంటుంద‌ని తెలుస్తుంది..!!

Hanu Raghavapudi gives a big update on Prabhas next!

samantha says no to sister kind of roles!